సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శుక్రవారం, 17 జులై 2020 (11:26 IST)

కరోనావైరస్‌తో వ్యక్తి మృతి, ఆ ఎస్ఐ ఏం చేశారంటే?

కరోనా వ్యాధి సోకిందంటే చాలు ఎవరూ ప్రక్కకు రారు. అలాంటి సందర్భంలో కన్నతల్లి అయినా కన్నతండ్రి అయినా దగ్గరకు వస్తున్న సందర్భాలు వుండవు. ఒకవేళ ఆ వ్యాధితో మరణిస్తే అక్కడికక్కడే మృతిచెందినవారిని వదిలి వేయాల్సిందే. అటువంటి తరుణంలో ఓ ఎస్ఐ తన మానవత్వాన్ని చాటుకున్నారు.
 
కుటుంబ సభ్యులు సైతం దూరంగా ఉండగా అన్నీ తానై చూసుకున్నారు. అంత్యక్రియలతో సహా పలు కార్యక్రమాలను చూసుకున్నారు. వాస్తవంగా పోలీసులు కఠినంగా ఉంటారని ప్రజల అభిప్రాయం. కరోనా వ్యాధితో మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియలను ఉరవకొండ ఎఎస్ఐ ధరణిబాబు దగ్గరుండి జరిపించారు.
 
వివరాలిలా వున్నాయి. ఉరవకొండకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 15 రాత్రి తీవ్ర జ్వరంతో ఉండటంతో కుటుంబ సభ్యులు 108తో పాటు ఉరవకొండ ఎస్ఐకి సమాచారం అందించారు. ఎస్ఐ వెంటనే స్పందించి ప్రైవేట్ ఆంబులెన్స్‌తో బాధితుడ్ని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి చికిత్స చేసినా ఫలించలేదు. దీనితో అతడు మరణించడంతో అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి తానే అన్ని కర్మకాండలను పూర్తిచేసాడు.