శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 16 జులై 2020 (21:18 IST)

కరోనావైరస్ వదిలినా దాని ప్రభావం మాత్రం వదలడం లేదు... ఏం జరుగుతుంది?

కరోనావైరస్, ఈ వైరస్ సోకకుండా వుండాలంటే భౌతిక దూరం, మాస్కులను ధరించడం, శానిటైజర్లు ఉపయోగించడం, బయటకు వెళ్లివచ్చిన వెంటనే చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవడం వంటివి చేస్తుండాలి. ఇవన్నీ చేస్తున్నా ఎక్కడో ఒక దగ్గర కాస్త ఛాన్స్ దొరికితే శరీరంలోకి ప్రవేశిస్తుంది కరోనావైరస్. ఈ మహమ్మారి పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా వుండాలి.
 
వైరస్ వచ్చిన తర్వాత చికిత్స తీసుకుని, కొన్నాళ్లపాటు క్వారెంటైన్లో వుండి లక్షణాలు పోయాయిలే అనుకునేందుకు వీలులేదు. ఎందుకంటే ఈ వైరస్ ఒకసారి సోకిన తర్వాత అది తగ్గినా ఆ తర్వాత ఇతర రకాల దుష్పరిణామాలు చూపుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు.
 
అరుదుగా కొందరు రోగుల్లో వైరస్‌ మెదడుపైనా ప్రభావం చూపుతోందట. అంతేకాదు కొంతమంది రోగులు కుంగుబాటుకు గురవుతున్నారు. కరోనావైరస్ అంటే వున్న భయం కారణంగా ఉద్వేగాలకు లోనవుతున్నారు. ఇంతకుముందు ఈ వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని భావించారు. కానీ తాజాగా ఇది గుండె, మెదడు, జీర్ణాశయం, మూత్రపిండాలపైనా ప్రభావం చూపుతుందని గుర్తించామని వైద్యులు చెపుతున్నారు.
 
అంతేకాదు కొంతమంది కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టడంతో గుండెపోట్లు కూడా సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా రోగుల్లో కొంతమంది తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు చెపుతున్నారు. కాబట్టి కరోనావైరస్ దరిచేరకుండా ఎంత జాగ్రత్తగా వుంటే అంత మంచిది.