సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 17 జులై 2020 (10:56 IST)

ఈ విధంగా అయితే కరోనావైరస్ కేసుల్లో భారత్ ఎక్కడికి వెళ్తుందో?

మూడంటే మూడు రోజుల్లో భారతదేశంలో లక్ష కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇలా రెండోసారి జరిగింది. ఈ స్పీడు ఇలాగే సాగితే భారతదేశం కరోనావైరస్ కేసుల సంఖ్యలో ఎంత వేగంతో వెళ్తుందోనన్న ఆందోళన నెలకొని వుంది. పైన పేర్కొన్న పట్టికలో చూడండి మొదటి లక్ష కేసులకు గాను కనీసం 109 రోజుల కాలం పట్టింది. ఆ తర్వాత లాక్ డౌన్ సడలింపుల ఫలితంగా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
 
ప్రజల్లో కరోనావైరస్ గురించి ఎంతమాత్రం భయంలేకపోవడం, పట్టింపులేని ధోరణి కారణంగా ఇది పెరుగుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడంలేదు. సామాజిక దూరం పాటించడంలేదు. మాస్కులు వేసుకోవడంలేదు. ఎవరో కొంతమంది తప్ప మిగిలినవారంతా ఎలాంటి సురక్షిత పద్ధతులు పాటించకుండా మిగిలినవారి ప్రాణాల మీదికి తెస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు కరోనావైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలి. లేదంటే పరిస్థితులు చేయిదాటితే చికిత్స చేసేందుకు ఆసుపత్రుల్లో ఖాళీ వుండదు. రోగులను చూసేందుకు వైద్యులు అందుబాటులో వుండరు.
 
గడిచిన 24 గంటల్లో భారత్‌లో 34,956 కేసులు నమోదు కాగా 687 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ తెలియజేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల మేరకు దేశంలో మొత్తం 10,03,832 కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,42,473గా ఉండగా 6,35,756 మంది చికిత్స నిమిత్తం కోలుకొని డశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉండగా 25,602 మంది కరోనా వ్యాధితో మరణించారు. దేశవ్యాప్రంగా నిన్న 3,33,228 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 1,30,72,718 మందికి కరోనా టెస్టులు చేసినట్లు వెల్లడించింది. ఇక దేశంలో కరోనా నుండి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 63 శాతం రికవరీ రేటు ఉందని కేంద్రం తెలిపింది.