బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2024 (15:51 IST)

జనసేనలోకి మంచు మనోజ్.. మౌనికా రెడ్డి!! (Video)

manchu manoj family
సీనియర్ నటుడు మోహన్ బాబు రెండో కుమారుడు, హీరో మంచు మనోజ్ రాజకీయ ప్రవేశం చేయనున్నారు. ఆయన తన భార్య మౌనికా రెడ్డితో కలిసి జనసేన పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతుంది. సోమవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి అత్తమామలైన భూమా నాగిరెడ్డి - శోభా నాగిరెడ్డి దంపతుల సమాధులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన వెయ్యి కార్లతో ర్యాలీగా వెళ్లి జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతుంది. 
 
నంద్యాల నుంచి రాజకీయ ప్రవేశం చేయబోతున్నారంటూ ప్రచారం సాగుతుంది. అయితే, ఈ ప్రచారంపై హీరో మనోజ్ లేదా ఆయన సతీమణి భూమా మౌనికా రెడ్డిల వైపు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. మున్ముందు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోహన్ బాబు కుటుంబ ఆస్తుల వివాదం నేపథ్యంలో మంచు మనోజ్ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్టు సమాచారం.