గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: బుధవారం, 5 జూన్ 2019 (20:01 IST)

20 రోజుల్లో పెళ్లి... పట్టపగలే యువకుడు దారుణ హత్య...

కడపలో ఓ యువకుడిని పట్టపగలే అత్యంత పైశాచికంగా నరికి చంపారు దుండగలు. అతడికి మరో 20 రోజుల్లో పెళ్లి కాబోతోంది. బుధవారం నాడు అతడు రైల్వే కోడూరు బస్సు స్టేషనులో బస్సు దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మాటువేసి వున్న దుండగలు అతడిపై ఆకస్మికంగా దాడి చేసి కత్తులతో నరికి హతమార్చారు.
 
వివరాల్లోకి వెళితే... హతుడి పేరు షేక్ అబ్దుల్. ఇతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రంజాన్ పండుగ సందర్భంగా బెంగళూరు నుంచి ఇంటికి బయల్దేరాడు. రైల్వే కోడూరు బస్సు స్టేషనులో బస్సు దిగి ఇంటికి వెళ్తూ వుండగా శ్రీకృష్ణ సినిమా థియేటర్ సమీపంలో కొందరు గుర్తు తెలియని దుండగలు అతడిపై హఠాత్తుగా దాడి చేసి హతమార్చారు. 
 
కాగా ఇతడికి తన మేనమామ కుమార్తెతో ఈ నెల 23న పెళ్లి జరగాల్సి వుంది. ఈ సమయంలో అతడిని హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతడి హత్యకు గల కారణాలు తెలియరాలేదు.