శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (17:49 IST)

ఏపీలో ఇక మాస్క్‌ తప్పనిసరి.. ప్రభుత్వ ఆదేశం

కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు చేపడుతోంది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని తేల్చి చెప్పింది.

బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రవాణా సమాయాల్లో మాస్కు ధరించటాన్ని తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సూచించిన నిర్దేశిత ప్రమాణాల్లో భాగంగా ఫేస్ మాస్కు, ముఖం కప్పుకునేలా కవర్ ఉండటాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశిలిచ్చింది.

ప్రజలు మాస్కు ధరించేలా విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు, మాస్కు ధరించటాన్ని అలవాటుగా మార్చుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

లాక్‌డౌన్‌ సమయంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఫేస్‌ మాస్కు తప్పనిసరి చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.