గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (13:33 IST)

విశాఖపట్నంలో పురాతన పెట్టె లభ్యం.. అందులో ఏముందో?

Visaka
Visaka
విశాఖపట్నంలో పురాతన పెట్టె లభ్యమైంది. వైఎంసీఏ బీచ్‌ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె అలల మధ్య కొట్టుకుని వచ్చిందని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి కొందరు పర్యాటకులు, మత్స్యకారులు ఈ పెట్టెను గమనించారు.
 
పురాతమైన చెక్క పెట్టె కావడంతో ప్రొక్లెనర్‌ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. చూసేందుకు భారీగా ఉన్న ఈ పెట్టెను బ్రిటీష్ కాలం నాటిదిగా అంచనా వేస్తున్నారు. వెంటనే ఆర్కియాలజీ విభాగానికి పోలీసులు సమాచారం ఇచ్చారు. 
 
దీంతో బీచ్‌లో ఉన్న సందర్శకులు ఆ భారీ పెట్టెను చూసేందుకు ఎగబడ్డారు. వారిని పోలీసులు కట్టడి చేయడానికి ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పెట్టెలో ఏముందనేది అందరిలో ఉత్కంఠ రేపుతోంది.