శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (11:03 IST)

హైదరాబాద్: వాగులో కొట్టుకుపోయిన మహిళ.. చివరికి?

Rains
హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో వాగుల్లా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలో ఓ మహిళ కాలువలో పడి మృతి చెందింది. మహిళను రక్షించేందుకు స్థానికులు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కిలోమీటరు దూరంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.
 
స్కందగిరి ఆలయంలో భిక్షాటన చేస్తున్న మహిళ(45) గురువారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో దూద్ బావి వద్ద కాలువ దాటేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది.
 
మహిళ కాలువలో కొట్టుకుపోవడంపై స్థానికులు స్థానిక కార్పొరేటర్ రాసూరి సునీత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కార్పొరేటర్ డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. 
 
చివరకు వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబర్ నగర్‌లో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతి చెందిన మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.