సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (16:20 IST)

మహిళా భాగస్వామిని దుస్తులు చిరిగేలా చితకబాడిన స్పా మేనేజర్.. వీడియో వైరల్

spa manager assaults woman
గుజరాత్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన జరిగింది. మహిళా వ్యాపార భాగస్వామిని నాలుగు నిమిషాల పాటు దుస్తులు చిరిగిపోయాలా స్పా మేనేజరు చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.
 
అహ్మదాబాద్‌లో ఓ స్పా నిర్వహకుడు తన వ్యాపార భాగస్వామి అయిన మహిళపై విచక్షణారహితంగా దాడి చేశాడు. బహుళ అంతస్తు భవనంలో స్పా ఆవరణలో టెర్రస్‌పై మహిళను చితకబాది, ఆ తర్వాత ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెపై చేయి చేసుకోవడం, చెంపలు పగులగొట్టడం ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఇలా నాలుగు నిమిషాల పాటు ఆ మహిళపై స్పా మేనేజరు దాడి చేశాడు. 
 
ఆ స్పా నిర్వాహకుడిని మోహిసిన్‌గా గుర్తించాడు. ఆ మహిళను చితకబాదుతూ స్పా లోపలికి ఈడ్చుకెళ్లడం వీడియోలో చూడొచ్చు. కొంత వ్యవధి తర్వాత ఆ డోర్‌ను తన్నుకుని ఆ మహిళ బయటకు వచ్చింది. ఆమె కుర్తా చినిగిపోయి పేలికలుగా కనిపిస్తుంది. దుస్తులు చినిగిపోయేంతగా అతడు ఆమెపై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ వీడియో చూసేవారు సైతం చలించిపోయేలా ఉంది. ఈ ఘటన ఈ నెల 25వ తేదీన జరిగింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి స్పా నిర్వాహుకుడి మోహిసిన్‌కు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.