శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (16:52 IST)

వినాయక చవితికి ఖైరతాబాద్ గణేశుడు సిద్ధం

khiratabadh ganesh
వినాయక చవితికి ఖైరతాబాద్ గణేశుడు సిద్ధం అవుతున్నాడు. గత ఏడాది 58 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు ఈసారి 63 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్నాడు. సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు తొలి పూజలు నిర్వహించనున్నారు. 
 
ఈ ఏడాది నవరాత్రి వేడుకలకు శ్రీ దశ మహా విద్యా గణపతిగా గణనాథుడు ఖైరతాబాద్ వినాయకుడు దర్శనమివ్వనున్నారు. ఈసారి మట్టితో పూర్తిగా ఈ వినాయకుడిని తయారు చేశారు.