బివేర్ ఆఫ్ స్కామర్స్ అంటూ పోస్టర్లు.. సీడబ్ల్యూసీ కరప్ట్ వర్కింగ్ కమిటీ
హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల తరుణంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సీడబ్ల్యూసీ కరప్ట్ వర్కింగ్ కమిటీ అంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుల ఫొటోలు, వారు చేసిన స్కాముల వివరాలతో పోస్టర్లు గోడలపై పోస్టర్లు అంటించారు.
హోర్డింగ్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి చేసిన స్కాములంటూ పోస్టర్లపై రాసుకొచ్చారు. బివేర్ ఆఫ్ స్కామర్స్ అంటూ టాగ్‌లైన్‌తో పోస్టర్లు ఉన్నాయి.
కాగా ఈ రోజు నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. హోటల్ తాజ్ కృష్ణలో ఈ సమావేశాలు జరగనున్నాయి.
హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందని జీర్ణించుకోలేని వారే ఇలా చేస్తున్నారంటూ విమర్శించారు.