శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:30 IST)

కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు సత్వరమే అందాలి : కృష్ణాజిల్లా కలెక్టర్

కృష్ణాజిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలోని  అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు  కోవిడ్  పేషెంట్లకు వైద్య సేవలు అందించడానికి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో  సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ ఏ ఎన్ డి ఇంతియాజ్ పేర్కొన్నారు. 

కృష్ణా జిల్లాకు సంబంధించి  బుధవారం సాయంత్రం 6 గంటల వరకు 12, 956 మందికి వాక్సినేషన్ కార్యక్రమం జరిపినట్లు ఇంతియాజ్ సమాచారం ఇచ్చారు. కోవిడ్ నిర్దారణ పరీక్షలను రెండింతలు చేయాలని, ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను 1000కి పైగా పెంచాలన్నారు.

రోజుకు 1.25 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని.. అన్ని జిల్లాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో కోవడ్ వ్యాప్తిని నియంత్రించుటకు తీసుకోవాల్సిన తగు చర్యల గురించి నిర్దేశించారు.