శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 11 ఆగస్టు 2018 (16:47 IST)

శిల్పా... నీ స్ట్రక్చర్ అదుర్స్.. నువ్వు సరే అంటే... ప్రొఫెసర్ల నిర్వాకం...

తిరుపతిలో వైద్యురాలు శిల్ప ఆత్మహత్య కేసు ఒక్కోరోజు ఒక్కో మలుపు తిరుగుతోంది. శిల్ప ఆత్మహత్యకు ప్రొఫెసర్ల వేధింపులే కారణమని ముందు నుంచి సహచర విద్యార్థులు చెబుతూ వచ్చారు. అయితే ప్రొఫెసర్లు ఏ విధంగా వేధించారో తెలిసి ఆశ్చర్యపోయారు.

థియరీ పరీక్షల్లో తనకు వచ్చిన అనుమానం నివృత్తి చేసుకునేందుకు ప్రొఫెసర్ల దగ్గరకు వెళ్ళారు శిల్ప. అయితే ముగ్గురు ప్రొఫెసర్లు శిల్పను అంగాంగం గురించి వర్ణించారంటున్నారు సహచర విద్యార్థులు. శిల్పా.. నీ స్ట్రక్చర్ చాలా బాగుంది. అదిరిపోయావు. ఒక్క రాత్రి మాకు కేటాయించు... నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ఆమెను శారీరకంగా ప్రొఫెసర్లు వేధించారంటున్నారు సహచర విద్యార్థులు. 
 
పెళ్ళై, ఒక బిడ్డ ఉన్న శిల్పతో ప్రొఫెసర్లు ఇలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు మహిళా సంఘాలు. ప్రొఫెసర్లను బదిలీ చేయడం కన్నా వారిని విధుల నుంచి పూర్తిగా బహిష్కరించి మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఏ విద్యార్థినికి జరగకుండా చూడాలంటున్నారు సహచర విద్యార్థులు.