బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 15 జనవరి 2021 (14:03 IST)

ఈతకోటలో సందడి చేసిన మెగా డైరెక్టర్ వివి వినాయక్

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ప్రముఖ సినీ మెగా డైరెక్టర్ వివి వినాయక్ ఈతకోట గ్రామంలో సందడి చేశారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుండి వారి స్వగ్రామమైన పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లుకు విచ్చేసిన ఆయన ఇంటి వద్దే కుటుంబ సభ్యులతో కలిసిభోగి వేడుకల్లో పాల్గొన్నారు.

అనంతరం బంధువులతో సంక్రాంతి పండుగ వేడుకల్లో  పాల్గొని అందరితో సరదగా గడిపారు. ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగ కు ఉభయ గోదావరి జిల్లాలో సరదాగా పర్యటించే వినాయక్. బుధవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామానికి తన సోదరుడు చాగల్లు గ్రామ మాజీ సర్పంచ్, వ్యవసాయ సాంకేతిక సలహా మండలి కమిటీ చైర్మన్ గండ్రోతు సురేంద్ర కుమార్ తోను మరియు స్నేహితులతో కలిసి ఈతకోటలో బంధువుల ఇంటికి విచ్చేశారు.

వీరికి గ్రామ ప్రజలు. బంధువులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బంధువులతో సరదాగా కొంత సమయం గడిపారు. వినాయక్ సేవా యూత్ సర్కిల్ నిర్వాహికులు గండ్రోతు వీరగోవిందరావు, గండ్రోతు దుర్గాసురేష్, దుర్గాదేవిల ఇంటికి వెళ్లి తేనీరు విందును స్వీకరించి అందర్నీ పలకరించారు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలును ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా వినాయక్ ను పూలమాలలతో దుశ్వాలతో ఘనంగా సత్కరించి సేవా యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల ఫొటో ప్రేమ్ ను ఆయన చేతులు మీదుగా ఆవిష్కరించి దుర్గాదేవి చేతులు మీదుగా భగవత్ గీత పుస్తకాన్ని, ఫొటో ప్రేమ్ ను వినాయక్ కి అందజేశారు. వినాయక్ రాకతో అభిమానులు ఫొటోలకు సెల్ఫీలకు ఎగబడ్డారు.

ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా మిత్ర మండలి అధ్యక్షులు తోట మారేశ్వరరావు(మారియ్య), బీజేపీ నేతలు నందం శ్రీలక్ష్మి. మెడిశెట్టి వెంకట్రావు,  గోనెమడతల కనకరాజు, గ్రామ టిడిపి అధ్యక్షుడు మిరియాల రాము, వైసిపి నాయకుడు, యర్రంశెట్టి కాళీకృష్ణ, టీడీపీ, వైసిపి, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.