కోడి పందేలకు కరోనా రాదా? : సిపిఐ

cpi ramakrishna
ఎం| Last Updated: గురువారం, 14 జనవరి 2021 (22:08 IST)
వేలాదిమంది గుమికూడి కోడి పందేలు నిర్వహిస్తే కరోనా వైరస్‌ రాదా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు.

కోడి పందేలను అడ్డుకుంటామన్న ప్రభుత్వం ప్రజాప్రతినిధుల సమక్షంలోనే జరుగుతుంటే ఏం చేస్తుందని గురువారం ఒక ప్రకటనలో నిలదీశారు.

ఎన్నికలు జరపటానికి కరోనాను బూచిగా చూపిన ప్రభుత్వం కోడి పందేల పట్ల ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తోందన్నారు.

పోలీసులు కోడిపందేల నిర్వాహకులతో లాలూచీ పడ్డారా అని ప్రశ్నించారు. దీనిపై డిజిపి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
దీనిపై మరింత చదవండి :