శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (09:04 IST)

రాజకీయాల్లోకి మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు

mekapati vikram reddy
మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం నుంచి మరో వారసుడు రాజీకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. మేకపాటి చిన్నకుమారుడు మేకపాటి విక్రమ్ రెడ్డి రాజకీయాల్లోకి రానున్నారు. ఇటీవల ఈయన అన్న మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే. దీంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో మేకపాటి గౌతంరెడ్డి సతీమణి శ్రీకీర్తి రెడ్డిని తొలుత బరిలోకి దించాలని భావించారు. అయితే, మేకపాటి కుటుంబం మాత్రం ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని బరిలోకి దించేందుకు సమ్మతించింది. ప్రస్తుతం ఆయన మేకపాటి కుటుంబానికి చెందిన కేఎంసీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఎండీగా కొనసాగుతున్నారు.  
 
ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో గౌతం రెడ్డి భార్య మేకపాటి శ్రీకీర్తి రెడ్డిని బరిలోకి దించుతారని ప్రచారం జరిగిందని, ఇదే అంశంపై తమ కుటుంబం సుధీర్ఘంగా చర్చించి గౌతంరెడ్డి స్థానంలో సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని బరిలోకి దించాలని నిర్ణయించినట్టు మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయంపై తమ కుటుంబం మొత్తం ఏకగ్రీవంగానే నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.