బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (09:25 IST)

ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి గుండెపోటు - హఠాన్మరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన హఠాన్మరణం చెందారు. 
 
ఆయన సోమవారం ఉదంయ గుండెపోటుకు గురికాగానే ఆయనను హుటాహుటిన హైదరాబాద్ నగరానికి తరలించి అత్యవసర సేవల విభాగంలో వైద్యులు వైద్యం చేశారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. 
 
కాగా, నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదే సెగ్మెంట్‌ నుంచి 2014లోనూ గెలుపొందారు. మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి జగన్ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవలే దుబాయి పర్యటనకు వెళ్లి వచ్చారు.