శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జులై 2022 (11:03 IST)

నెల్లూరు - కడప జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి

earthquake
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, కడప జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ఆ రెండు జిల్లాల వాసులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
 
బుధవారం తెల్లవారుజామున ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ భూప్రకంపనల ధాటిలో గృహాల్లోని సామాగ్రి కిందపడటంతో ఆయా గృహాల వాసులు భయంతో వణికిపోతూ బయటకు పరుగులు తీశారు.
 
ముఖ్యంగా కడప జిల్లా బద్వేల్ మండలంలోనూ ఈ భూప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని మర్రిపాడు మండలంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు.