1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

అన్నమయ్య జిల్లాలో చింత చెట్టు నుంచి పాలు

milk from Tamarind
ప్రపంచంలో ఏదో ఒక మూలన విచిత్ర సంఘటన జరుగుతుంది. తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఓ చింత చెట్టు నుంచి పాలు కారుతున్నాయి. ఈ విచిత్ర ఘటన వివరాలను పరిశీలిస్తే, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి కురబల కోట మండలం కొండమర్రిలో చింత చెట్టు నుంచి పాలు ధారగా కారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 
 
రోజువారీగా పొలానికి వెళ్లిన ఓ రైతు పొలంలో ఉన్న చింతచెట్టు నుంచి పాలు కారడం చూశాడు. ఇది గ్రామస్థులకు చెప్పాడు. ఈ విషయం ఆ నోటా ఈనోటా పొరుగు గ్రామాలకు కూడా చేరింది. దీంతో ఈ వింతను చూసేందుకు జనం పొలాని క్యూ కట్టారు. చింత చెట్టు నుంచి పాలు కారడం చూసిన ప్రజలు మాత్రం ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానంలో చెప్పినట్టుగానే జరుగుతుందని పేర్కొంటూ ఆ చెట్టుకు పూజలు చేయడం మొదలుపెట్టారు.