గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (18:58 IST)

పులివెందులలో సీబీఐ బృందం.. వివేకా - అవినాష్ ఇళ్ళలో తనిఖీలు

ys avinash - ys viveka
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మరోమారు పులివెందులలో కనిపించారు. ఆదివారం కొందరు అధికారులు పులివెందులకు చేరుకుని వివేకా నంద రెడ్డి హత్యకు గురైన ఇంటితో పాటు ఆ పక్కనే ఉన్న కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి పీఏ రమణారెడ్డితో సీబీఐ అధికారులు మాట్లాడారు. 
 
అలాగే, వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసే ఇనయతుల్లాతో కూడా సిట్ అధికారులు మాట్లాడారు. వివేకా హత్య జరిగిన ఇంటితో పాటు బాత్రూమ్, బెడ్రూమ్‌లను కూడా పరిశీలించారు. అటు తర్వాత వివేకా ఇంటి నుంచి బయటకు వచ్చిన అధికారులు సమీపంలోని అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆ పరిసరాలను తనిఖీ చేశారు. అవినాష్ ఇంటిని పరిశీలించాక తిరిగి వివేకా ఇంటికి వచ్చిన హత్య జరిగిన ప్రాంతాన్ని చూశారు. 
 
హత్య జరిగిన రోజున, సమయంలో ఎవరెవరు ఉన్నారో ఆరా తీశారు. అవినాష్ రెడ్డి ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో రావొచ్చునే సాంకేతికంగా ఆధారాలు సేకరించారు. అంతేకాకుండా, తమ విచారణలో అవినాష్ రెడ్డి చెప్పిన విషయాలను నిజమో కాదో.. ఆయన పీఏ రమణారెడ్డి వద్ద కూడా ఆరా తీశారు.