ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 మార్చి 2023 (15:13 IST)

భార్య అలిగింది.. పది రోజులు సెలవు కావాలి సార్... ఇన్‌స్పెక్టర్

anger
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూకాబాద్‌లోని పోలీస్-స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఇన్‌స్పెక్టర్ తన అసాధారణ సెలవు దరఖాస్తుతో వార్తల్లో నిలిచాడు. పని ఒత్తిడి కారణంగా గత 22 సంవత్సరాలుగా హోలీ సందర్భంగా ఆమెను తన తల్లి ఇంటికి తీసుకెళ్లలేకపోయినందుకు తన భార్య తనపై కోపంగా ఉందని వివరిస్తూ ఇన్‌స్పెక్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ మీనాకు లేఖ రాశారు. 
 
భార్య కోపాన్ని చల్లార్చేందుకు పది రోజుల సెలవు కోరాడు. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది ఇన్‌స్పెక్టర్ తన కుటుంబంపై వున్న అంకితభావాన్ని మెచ్చుకున్నారు. ఇక భార్య అలిగిందని పది రోజులు సెలవు కావాలన్న ఇన్‌స్పెక్టర్‌కు పోలీసు సూపరింటెండెంట్ ఐదు రోజుల సెలవు మంజూరు చేశారు.