సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 మార్చి 2023 (09:25 IST)

పెళ్లికూతురైన శ్రీముఖి.. హల్దీ ఫోటోలు వైరల్..

బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకున్న స్టార్ యాంకర్ శ్రీముఖి.. పెళ్లి కూతురైంది. ఓ వైపు టీవీ షోలతో పాటు సినిమాలు కూడా చేస్తూ వస్తున్న శ్రీముఖి.. బిగ్ బాస్‌లోనూ పార్టిసిపేట్ చేసింది. తాజాగా శ్రీముఖికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
శ్రీముఖి తన ప్రేమికుడిని వివాహం చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఓ వ్యాపారవేత్తను ప్రేమించిన శ్రీముఖి.. పెద్దల అంగీకారంతో పెళ్లికి రెడీ అయ్యిందని టాక్ వస్తోంది. 
 
శ్రీముఖి ఎవ్వరికీ చెప్పకుండా సైలెంట్‌గా పెళ్లి చేసుకోబోతుందని పెళ్లి చేసుకున్నాక ఒకేసారి తన భర్తని పరిచయం చేస్తుందని టాక్ వస్తోంది. ప్రస్తుతం శ్రీముఖి పెళ్లికి సంబంధించిన హల్దీ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.