శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 9 అక్టోబరు 2021 (23:05 IST)

నష్టాల్లో ఉన్నాం, కానీ లాభాల బాటలోకి తెస్తాం, మంత్రి అవంతి

రాయలసీమ జిల్లాల్లో టూరిజంను మరింత అభివృద్థి చేస్తామన్నారు పర్యాటక శాఖామంత్రి అవంతి శ్రీనివాస్. తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. 
 
కరోనా కారణంగా టూరిజం నష్టాల్లోకి వెళ్ళిపోయిన మాట వాస్తవమేనన్నారు. 130 కోట్ల వార్షిక ఆదాయం వచ్చే టూరిజం శాఖ ప్రస్తుతం 60 కోట్ల ఆదాయంకు చేరుకుందన్నారు. పర్యాటక శాఖ సిబ్బంది కలిసికట్టుగా పనిచేయడంతోనే కష్టసమయంలో కూడా ఆదాయాన్ని సంపాదించగలిగామని చెప్పారు. 
 
పర్యాటక ప్రాంతాలకు సందర్సకుల తాకిడి క్రమేపీ పెరుగుతోందని..ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లోని పర్యాటకులనే కాకుండా కర్ణాటక, చెన్నై రాష్ట్రాల నుంచి వస్తున్న పర్యాటలకును ప్రత్యేక ప్యాకేజీలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. విమానాల్లో తిరుపతి విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకులకు టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొస్తోందన్నారు. 
 
తిరుపతిలో త్వరలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్టార్ హోటల్‌ను నిర్మిస్తామన్నారు. అలాగే నూతనంగా మరో 26బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. తిరుచానూరులోని పద్మావతి నిలయంను టూరిజం శాఖకు టిటిడి అప్పగించనుందని.. పర్యాటక శాఖ పద్మావతి నిలయంను తీసుకున్న తరువాత పర్యాటకులకు గదుల కేటాయింపు జరుగుతుందని మంత్రి వివరించారు.