శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 నవంబరు 2021 (15:05 IST)

పేర్ని నాని ప్రెస్‌మీట్... టిక్కెట్ ధరలపై నిర్ణయం తీసుకుంటాం

టిక్కెట్ల ధరలపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చేసిన విజ్ఞప్తిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీలో సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశంపై పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని నాని అన్నారు. 
 
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎంతో చర్చించి నిర్ణయిస్తామని ఈ విషయాన్ని సినీ పెద్దలకు స్పష్టం చేశామన్నారు. వరదల సమీక్ష, అసెంబ్లీకి సమావేశాలకు అనంతరం టిక్కెట్ ధరలపై నిర్ణయం తీసుకుంటామని నాని వెల్లడించారు. 
 
ప్రభుత్వంలో లోపాలు చూపితే సరి చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన సెక్రటేరియట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు వరద బాధితుల దగ్గరకెళ్లి ఆయన సతీమణి గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. 
 
భువనేశ్వరిని తిట్టారంటూ బాధితుల దగ్గర ఏడుపు ఎందుకని ప్రశ్నించారు. ఆమెను తాము ఏమీ అనలేదన్నారు. ‘నిన్ను తిడతాం గానీ... మీ ఇంట్లో వాళ్ళను ఎందుకు తిడతామన్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబును చీదరించుకుంటున్నారన్నారు.