శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (12:55 IST)

రష్మీ గౌతమ్‌కు గోల్డెన్ ఛాన్స్.. మెగాస్టార్‌తో స్టెప్పులు

బుల్లితెర స్టార్ రష్మీ గౌతమ్ అదిరిపోయే ఆఫర్‌ను కైవసం చేసుకుంది. కేవ‌లం టీవీకే ప‌రిమిత‌మైపోకుండా ఈ అమ్మ‌డు అడ‌పా ద‌డ‌పా సినిమాల్లోనూ న‌టిస్తూ వ‌స్తుంది. తాజా స‌మాచారం మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేసే ఛాన్సును కొట్టేసింది. మెగాస్టార్ హీరోగా మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న భోళా శంక‌ర్‌లో ర‌ష్మీ గౌత‌మ్ న‌టించ‌నుంద‌ని టాక్‌.
 
ప్ర‌త్యేక‌మైన సెట్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. దీని త‌ర్వాత ఓ సాంగ్ చిత్రీక‌రించ‌నున్నారు. ఈ సాంగ్‌లో ర‌ష్మీ గౌత‌మ్ న‌టిస్తుంద‌ని స‌మాచారం. 
 
ఇకపోతే.. భోళా శంకర్ సినిమా త‌మిళ చిత్రం వేదాళంకు ఇది రీమేక్‌. అజిత్ చేసిన పాత్రను చిరంజీవి చేస్తున్నారు. ఇందులోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం చిరంజీవి గుండు లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. 
 
మిల్కీబ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో మ‌రో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ క‌నిపించ‌నుంది. 
 
ఇప్ప‌టికే చిరంజీవి ఆచార్య సినిమాను పూర్తి చేసేశారు. అది ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల‌వుతుంది. ఇప్పుడు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసిఫ‌ర్ రీమేక్ గాడ్‌ఫాద‌ర్‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ముగింపు దశ‌కు చేరుకుంది. ఇందులో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ కూడా న‌టిస్తున్నారు.
 
న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ ఇలా మంచి స్టార్ క్యాస్టింగ్‌తోనే సినిమా తెర‌కెక్కుతోంది. ఇవ‌న్నీ కాకుండా బాబీ డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమాను చిరంజీవి ప్రారంభించారు.