శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (18:42 IST)

చిరంజీవిని పంపిన విధికి ధ‌న్య‌వాదాలు తెలిపిన కార్తికేయ

Kartikeya, chiru, lohita
చిన్న‌త‌నంలో ప‌ట్టుద‌ల‌తో ఏదో ఒక‌టి అనుకుంటే అది పెద్ద‌య్యాక తీరుతుంద‌నేది తెలిసిందే. అలాంటిదే న‌టుడు కార్తికేయ జీవితంలో జ‌రిగింది. ఇందుకు డెస్టినీ (విధికి) కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ మంగ‌ళ‌వారం నాడు పోస్ట్ పెట్టాడు కార్తికేయ‌.
 
నేను పెదయ్యాక హీరో అవుతా. అప్పుడు చిరంజీవి కూడా నా పెళ్లికి వస్తాడు” అని చిన్న‌త‌నంలో అనుకున్నాడ‌ట కార్తికేయ. అది నిజ‌మైంది. మెగాస్టార్ అభిమాని అయిన ఆయ‌న ఏమంటున్నారంటే, 
 
నేను అమాయకపు పిల్లవాడిగా వున్న‌ట‌ప్పుడు ఇలా నాకు నేను చెప్ప‌కున్నా. ఇంటిలోవారికి చెప్పా. వీడేదో అంటున్నాడ‌ని న‌వ్వుకున్నారు. ఇప్పుడు అదే నిజ‌మైంది. ఇందుకు విధికి ధన్యవాదాలు. మెగాస్టార్ చిరంజీవిగారు మీరు ఆశీర్వదించడానికి వ‌చ్చారు. ఎప్పటిలాగే మిమ్మ‌ల్ని అభిమానిస్తూనే వుంటాను. ఈ ఘ‌ట‌న‌తో మ‌రింత ప్రేమ మీపై పెరిగింది అంటూ ఆనందంతో కూడిన ప‌దాల‌తో ట్వీట్ చేశాడు.
 
ఇటీవ‌లే ఆదివారంనాడు ఆర్‌ఎక్స్‌ 100తో ఫేమస్‌ అయిన కార్తీకేయ తన బిటెక్‌ స్నేహితురాలైన లోహితను వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ పంక్షన్‌ హాల్‌లో ఘనంగా జరిగిన ఈ వేడుకలకు టాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా కార్తికేయ తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ నటిస్తున్న వలిమై చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.