గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 నవంబరు 2021 (15:42 IST)

ఓ ఇంటివాడైన 'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ

టాలీవుడ్ హీరో కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. "ఆర్ఎక్స్-100" చిత్రం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కార్తికేయ... ఇపుడు విలన్ పాత్రలను కూడా చేస్తున్నాడు. అయితే, తాజాగా ఆయన ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు లోహితను పెళ్లాడాడు. 
 
స్థానిక హైదరాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో ఈ వివాహం జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, తనికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ వంటి పలువురు సినీ సెలెబ్రిటీలు పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు. 
 
కాగా, బీటెక్ చదువుతున్న సమయంలో కార్తికేయకు లోహిత్ పరిచయమైంది. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇదిలావుంటే, హీరో కార్తికేయ ప్రస్తుతం ఆరు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న 'వలిమై' చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు.