శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (17:45 IST)

రాజ‌శేఖ‌ర్ కుమార్తె అద్భుతంకు చిరు ప్ర‌శంస‌- చాలా సంతోషంగా వున్నాం: రాజ‌శేఖ‌ర్‌

Chiru- Sivani
మెగాస్టార్ చిరంజీవి, డా. రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివాని న‌టించిన అద్భుతం సినిమాను మెచ్చు కున్నారు. నిజంగా అద్భుతంగా వుంద‌ని ట్వీట్ చేశారు. నిన్న రాత్రే చూశాను. ఆకట్టుకునే నవల కాన్సెప్ట్‌తో కూడిన కొత్త యుగం చిత్రం. ఇందుటో న‌టించిన న‌టీన‌టుల‌కు, సాంకేతిక సిబ్బందికి మంచి భ‌విష్య‌త్ వుంద‌ని కితాబిచ్చారు. ఇందులో తేజ స‌జ్జ క‌థానాయ‌కుడిగా న‌టించారు. ఈ సంద‌ర్భంగా తేజ స‌జ్జ ట్వీట్ చేస్తూ, మెగాస్టార్ చిరంజీవికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీలాంటివారి ఎంక‌రేజ్‌మెంట్ మాకు ఉత్సాహానిస్తుంద‌ని పేర్కొన్నారు.
 
నేను, జీవిత చాలా సంతోషంగా ఉన్నాం - రాజశేఖర్‌
జీవిత, రాజ‌శేఖ‌ర్‌లు చాలా సంతోషంగా వున్నామ‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ కుమార్తె శివాని న‌టించిన అద్భుతం’ చిత్రానికి మంచి పేరు వ‌చ్చింది. శివాని న‌ట‌న‌ను అంద‌రూ మెచ్చుకుంటుంటే వారు త‌మ ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. తేజ సజ్జా కథానాయకుడు. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదలైంది. 

 
ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ పాల్గొన్న సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ, ఇందులో నటించిన ప్ర‌తి ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డ్డారు. దానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ద‌క్కిందని పేర్కొన్నారు. ‘మా ఇద్దరు పిల్లలకి సినిమాలంటే ఇష్టం. శివాత్మిక ‘దొరసాని’తో విజయం అందుకుంది. శివాని ‘అద్భుతం’తో మంచి పేరు తెచ్చుకుంది. తల్లిదండ్రులుగా నేను, జీవిత చాలా సంతోషంగా ఉన్నాం. పరిశ్రమ నుంచి చాలా మంది ఫోన్లు చేసి సినిమా బాగుందని చెప్పినప్పుడు గర్వంగా అనిపించింది’’ అని రాజ‌శేఖ‌ర్ అన్నారు.‘పిల్లల్ని కనగలం కానీ, వాళ్ల తలరాతల్ని మనం కనలేం’’ కానీ మంచి పేరు తెచ్చిపెట్టారు మాకు అన్నారు జీవిత.

 
శివాని మాట్లాడుతూ, ఈ సినిమా మా తాత గారు చూడలేక‌పోయారు. సినిమా విడుద‌ల‌ ముందు షూటింగ్‌లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. అవ‌న్నీ ‘అద్భుతం’ విజయం మ‌ర్చిపోయేలా చేసింది. ఇందులో వెన్నెల పాత్ర వినగానే నాకు బాగా కనెక్ట్‌ అయ్యింది. మా తాతయ్య ఈ సినిమాని చూడాలనుకున్నారు. ఆయన కొవిడ్‌తో చనిపోయారు. ఆయనకి ఈ చిత్ర విజయాన్ని అంకితం చేస్తున్నా’’ అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో దేవిప్ర‌సాద్‌, ప‌ద్మాంజ‌లి, బుల్లెట్ భాస్క‌ర్‌, చ‌మక్ చంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.