గురువారం, 23 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated: సోమవారం, 2 జనవరి 2023 (11:09 IST)

సోషల్ మీడియా ట్రోల్స్‌పై ఆర్కే రోజా ఫైర్

rk roja
సోషల్ మీడియా ట్రోల్స్‌పై ఆంధ్రప్రదేశ్ టూరిజం మంత్రి రోజా స్పందిస్తూ, తనను, తన కుటుంబాన్ని ట్రోల్ చేయడానికి జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలతో చేరారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. జనసేన, టీడీపీ కార్యకర్తలు తనను ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. 
 
బలమైన నేతలను నేరుగా ఎదుర్కోలేక వారిపై అనుచిత మాటలు మాట్లాడేవారని మంత్రి రోజా అన్నారు. మంత్రి అయిన తర్వాత తన సోదరుడు తనను ముద్దుపెట్టుకున్న విషయంపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని చెప్పారు. సంబంధాల విలువ తెలిస్తే ప్రజలు ఎప్పుడూ చౌకబారు వ్యాఖ్యలు చేయరని కౌంటర్ ఇచ్చారు. 
 
మంత్రి అయిన తర్వాత తన అన్న తనకు ముద్దు పెడితే కూడా పెడార్థాలు తీస్తున్నారని రోజా మండిపడ్డారు. తనకు అమ్మనాన్నలు లేరని... ఇద్దరు అన్నయ్యలే తనను పెంచారని తెలిపారు. స్కూలుకు వెళ్లినప్పుడు, కాలేజీకి వెళ్లినప్పుడు, షూటింగుల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా 24 గంటలూ వాళ్ల జీవితం కాదని, తన కోసం పని చేస్తున్నారని రోజా తెలిపారు.