గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

రైతు కూలీగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. దుక్కిదున్ని... నారు పీకి...

Errabelli Dayakar Rao
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతు కూలీగా మారిపోయారు. ఆయన అరక చేతబట్టి దుక్కిదున్నారు. ఆ తర్వాత రైతు కూలీలతో కలిసి పొలంలో దికి నారు పీకారు. కూలీలతో కలిసి ఉత్సాహంగా మంత్రి పని చేశారు. ఈ దృశ్యాలు ఆయన సొంతూరులో కనిపించాయి. 
 
మంత్రిగా ఉన్నప్పటికీ ఎర్రబెల్లి దయాకర్ రావు సొంతూరు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి. ఇక్కడ ఆయనకు పొలాలు ఉన్నాయి. ఇక్కడ సాగే వ్యవసాయ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. 
 
ఈ క్రమంలో తన సొంత పొలంలో సందడి చేశారు. కూలీలతో కలిసిపోయి ఉత్సాహంగా వరినారు పీకారు. నారుమడిలో నారు పీకి కట్టలు కట్టారు. అరక దున్ని సేద్యం చేశారు. తద్వారా వ్యవసాయంపై తన మమకారాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంది.