సముద్రతీరంలో తల లేని యువతి మృతదేహం.. అవాక్కైన పోలీసులు!
మనిషిని టెక్నాలజీ శాసిస్తున్న ఈ రోజుల్లో వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు సైతం రోబోలను ఉపయోగించుకుంటున్నారు. వ్యక్తిగత పనులకు మాత్రమే కాకుండా చివరకు శృంగార కోర్కెలు సైతం తీర్చుకునేందుకు వీటిని ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన వద్ద ఉన్న సెక్స్ డాల్ (కృత్రిమ శృంగార బొమ్మ) ఇకపై పనికిరాదన్న నిర్ణయానికి వచ్చాడు. ఆ బొమ్మ తల, మొండెంను వేరు చేశాడు. వాటిని తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. అయితే, అవి నీళ్లతో పాటు ఒడ్డుకు కొట్టుకునివచ్చాయి.
వాటిని చూసిన వారందరూ యువతి మొండెం భయపడిపోయారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు అక్కడకు వచ్చి నిశితంగా పరిశీలించారు. చివరకు అది యువతి మొండెం కాదని సెక్స్ డాల్ అని గుర్తించారు. అయితే, ఆ బొమ్మ తల ఎక్కడుందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆ రోబో బొమ్మతో శృంగార వాంఛ తీర్చుకుని ఇలా చేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ సెక్స్ డాల్ విలువ రూ.45 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాలను అక్కడకు వచ్చినవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో వెలుగు చూసింది.