సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (14:20 IST)

కేసీఆర్ పులి లాంటోడు.. వాడు, వీడు అంటే నాలుక చీరేస్తాం: శ్రీనివాస్ గౌడ్

minister srinivas gowd
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ పులి లాంటోడని శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ను ఎవ్వరూ ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ని, మంత్రుల‌ను వాడు, వీడు అంటే నాలుక చీరేస్తాం అని బండి సంజ‌య్‌ను మంత్రి హెచ్చ‌రించారు.
 
మ‌తం, కులం పేరిట రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌న్నారు. 2000లో మూడు రాష్ట్రాలు ఇచ్చిన‌ప్పుడే తెలంగాణ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. తెలంగాణ పుట్టుక నుంచే బీజేపీ ఈ ప్రాంతం పై వివక్ష ప్రదర్శిస్తోంద‌న్నారు. 
 
 
రాష్ట్రం రాగానే పోలవరానికి ఏడు మండలాలు, సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు బీజేపీ ప్ర‌భుత్వం కట్టబెట్టింద‌ని మంత్రి గుర్తు చేశారు.
 
సిగ్గు, శరం, లజ్జ లేకుండా బీజేపీ నేతలు నిన్న పాలమూరులో మాట్లాడారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వ‌జ‌మెత్తారు. సంజ‌య్ ఓ లుచ్చా లాగా, వీధిరౌడీలా మాట్లాడుతున్నాడ‌ని నిప్పులు చెరిగారు. 
 
ఆయ‌న‌కు బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చిన వాడేవ‌డో అని విమ‌ర్శించారు. సీఎం, మంత్రులను పట్టుకుని వాడు వీడు అంటావారా సంజయ్.. ఎవడివిరా నీవు, నీకెవడ్రా సంస్కారం నేర్పింది అని దుమ్ముదులిపారు.