బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:00 IST)

పవన్ కళ్యాణ్‌ను ప్రజలు ఛీ కొట్టినా బుద్ది రాలేదు: మంత్రి వెలంప‌ల్లి

పేదలందరికీ  శాశ్విత గృహ వసతి, ఇళ్ళ పట్టాల పంపిణీ కార్య‌క్రమంలో భాగంగా 4వ‌ రోజు 30, 31, 32 డివిజ‌న్లు పరిధిలోని సయ్యద్ అప్పలస్వామి కళాశాల నందు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో లబ్ధిదారులకు పట్టాలను మంత్రి పంపిణి చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ  చంద్ర‌బాబు పేదలకు ఇళ్ళివ్వలేకపోయారన్నారు.  టిడ్కో ఇళ్ల పేరిట పేద‌లను మోసం చేశారన్నారు.  పేద ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం జగనన్న‌ ప్రభుత్వం..ప్రజలను దోచుకొనే చంద్రబాబు అని ప్ర‌జ‌లే అంటున్నార‌న్నారు. 
 
పవన్ వకీల్ సాబ్ ను రెండు చోట్ల ప్ర‌జ‌లు ఓడించారు. అటు రాజకీయాల్లో పనికిరాక‌, ఇటు సినిమాల్లోకి కాకుండా సన్యాసిలాగా ప్యాకేజి ప‌వ‌న్ మిగిలిపోతాడన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్దతిచ్చి నాలుగేళ్ళు అంటకేగావు.. ఒక్కరికైనా ఇళ్లిప్పిచ్చావా  అని ప‌వ‌న్ క‌ల్యాణ్ మంత్రి ప్ర‌శ్నించారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రైతులు ఎవరూ బయటకొచ్చి ఆందోళన చేయడం లేదన్నారు. ఢిల్లిలో రైతుల చేస్తున్న అందోళ‌న‌పై ఎందుకు మాట్లాడడం లేదన్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ దొందూ దొందే..ప్రజలు వారి మాటలు నమ్మవద్దు అని సూచించారు. పవన్ కు ప్రజలు కష్టాలు తెలియవు..కేవలం ఎన్నికల కోసమే ప్రజలపై ప్రేమ పుట్టికొచ్చినట్టుందన్నారు.