సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (07:21 IST)

నేడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్‌ పర్యటన

నివర్‌ తుపాను కారణంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బుధవారం జిల్లాల్లో పర్యటించనున్నారు.

నీట మునిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలిస్తారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు కృష్ణాజిల్లా ఉయ్యారు చేరుకుంటారు.

అనంతరం పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లాకు చేరుకుంటారు. జిల్లాలో భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరుల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటిస్తారు.