మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (16:30 IST)

పవన్ నా దేవుడు... ఆయన్నేమైనా అంటే నేనూరుకోను...? (Video)

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ని 'ఊసరవెల్లి' అని కామెంట్ చేసిన నటుడు ప్రకాష్ రాజ్ కు కమేడియన్, నిర్మాత బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. 'ఎలక్షన్స్‌ టైమ్‌లో మాట్లాడటం ఎందుకని ఏం మాట్లాడలేదు.. నా దేవుడిని ఏమైనా అంటే అస్సలు సహించేది లేదంటూ..' ట్వీట్స్‌ సంధించారు.
 
''ఎలక్షన్ టైంలో మాట్లాడటం ధర్మం కాదని, రాజకీయాలు మాట్లాడకూడదని నేనేం మాట్లాడలేదు నేను ఒకటి మాత్రం చెప్తున్నా.. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. ఆయన వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధత నాకు తెలుసు.

పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కానీ వ్యక్తిత్వం గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను. పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం.

ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు, ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత మా దైవం పవన్ కళ్యాణ్‌ది. నిజాయితీకి నిలువుటద్దం పవన్ కళ్యాణ్.

కృతజ్ఞత అనేది నా రక్తంలో ఉంది. నేను ఈరోజు అనుభవిస్తున్న ఈ స్థాయి నాకు పవన్ కళ్యాణ్ పెట్టిన భిక్ష'' అని బండ్ల గణేష్‌ వరుస ట్వీట్స్‌లో తెలిపారు.