గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (12:15 IST)

అడవిలోకి తీసుకెళ్లి అమ్మాయిపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్

ఒడిషా రాష్ట్రంలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. అడవి విహారయాత్రకు తీసుకెళ్లిన యువతిని ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

ఒడిషా రాష్ట్రంలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. అడవి విహారయాత్రకు తీసుకెళ్లిన యువతిని ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిషా రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక పెళ్లికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తోంది. ఈయువతిని ముగ్గురు యువకులు అడ్డగించి.. అడవిని చూసొద్దామంటూ తీసుకెళ్లారు. 
 
అడవిలోకి కొంతదూరం వెళ్లిన తర్వాత.. ముగ్గురు యువకులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకుని వచ్చిన యువతి... జరిగిన ఘోరం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ అత్యాచారానికి పాల్పడిన నిందింతులంతా 19 నుంచి 25 ఏళ్ల వయసు వారేనని పోలీసులు చెప్పారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి పంపినట్టు పోలీసులు తెలిపారు.