శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (13:05 IST)

తరగతిగదిలో పెళ్లి .. రాజమండ్రి ప్రభుత్వ జూ.కాలేజీలో కలకలం

విద్యాబుద్ధులు నేర్చుకోమని పాఠశాలకు పంపించే యువతీయువకులు చిన్నవయసులోనే అడ్డదారులు తొక్కుతున్నారు. ముఖ్యంగా, యుక్త వయసుకు వచ్చిన అమ్మాయి, అబ్బాయిలు చిన్నవయసులోనే ప్రేమలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. 
 
ఈ కాలేజీకి చెందిన విద్యార్థి, విద్యార్థిని పెళ్లి చేసుకున్నారు. కాలేజీ నడుస్తున్న సమయంలోనే తరగతి గదిలోనే అమ్మాయి మెడలో పసుపుతాడు కట్టాడు. నుదుట బొట్టుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఇద్దరు మైనర్లు వివాహం నవంబర్ 17న జరిగినట్లు వీడియోల ద్వారా తెలుస్తోంది. 
 
దీంతో కాలేజీలో పెళ్లి జరిగిన వీడియోలు వైరల్‎గా మారాయి. వైరల్ అయిన వీడియో, ఫోటోలు కాలేజీ ప్రిన్సిపాల్ వరకు వెళ్లాయి. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్‎ ఇచ్చాడు. అంతేకాదు వీరికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపిచారు.