గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (18:44 IST)

బిజినెస్‌మ్యాన్‌తో సింగర్ సునీత రెండో పెళ్లి? (video)

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ మహిళా నేపథ్యగాయకుల్లో ఒకరు సునీత. ఈమె సింగర్‌గానే కాకుండా వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే, ఈమె రెండో పెళ్లి చేసుకోబుతుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. గతంలో ఇదే తరహా వార్తలు వచ్చాయి. వాటిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. 
 
కానీ, తాజాగా మరోమారు సునీత రెండో పెళ్లిపై వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని, ఈ విషయంలో తనపై వస్తున్న పుకార్లను పట్టించుకోనని అన్నారు. అయితే లేటెస్ట్‌గా సింగర్‌ సునీత్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 
 
డిజిటల్‌ రంగంలో కీలక పాత్రను పోషిస్తున్న ఓ బిజినెస్‌మ్యాన్‌ను సునీత్ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. సునీత పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికి కూడా ఇది రెండో పెళ్లేనట. మరి తన పెళ్లి గురించి వినిపిస్తోన్న రూమర్స్‌పై సింగర్‌ సునీత ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. 
 
కాగా, గతంలో మీడియా రంగానికి చెందిన కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తిని సునీత పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆకాష్ గోపురాజు, శ్రేయా గోపురాజు అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.