శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (22:08 IST)

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు.. రూ.30లక్షల కట్నం..?

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు వివాహాలు చేసుకున్నాడు.. ఓ ప్రబుద్ధుడు. దీంతో నాలుగో భార్య పోలీసులను ఆశ్రయించింది. న్యాయం చేయాలంటూ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే.. మ్యాట్రిమోని ద్వారా వెంకట బాలకృష్ణ పవన్ కుమార్ అనే వ్యక్తితో బాధితురాలు హిమబిందుకి పరిచయమైంది. పెద్దల సమక్షంలో 2018లో వీరి వివాహం జరిగింది. 
 
నాలుగో పెళ్లి కోసం.. 30 లక్షలు కట్నంగా తీసుకున్నాడు పవన్. పవన్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించి మోసం చేశాడని.. అయితే పవన్‌కు గతంలోనే ముగ్గురితో వివాహం జరిగిందని తెలియవచ్చిందని బాధితురాలు వాపోయింది. దుబాయ్ వెళ్లిన తర్వాతే అతనికి మూడు సార్లు వివాహం జరిగినట్లు తెలిసిందని.. మొదటి భార్యకు పిల్లలు కూడా ఉన్నారని బాధితురాలు వెల్లడించింది. 
 
దుబాయ్‌లో తనపై హత్యాయత్నం పవన్ చేశాడని.. పవన్ తల్లిదండ్రులు కూడా అతని సహకరించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా ఒత్తిడి పెరుగుతుందని.. బెదిరింపులు వస్తున్నాయని, తనకు జరిగిన అన్యాయం ఏ అమ్మాయికి జరగకూడదు.

పవన్‌పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్, మహిళా పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.