నాతో వున్న అమ్మాయి ఎందుకు వచ్చిందో తెలుసా?: మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర భర్త (Video)
తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర భర్త తేజ చెప్పుకొచ్చారు. గత నాలుగేళ్లుగా ఆమె తనకు దూరంగా వుంటోందనీ, తనపై దిశ కేసు కింద తప్పుడు కేసులు పెట్టారంటూ వెల్లడించారు. తనతో పాటు వున్న అమ్మాయి సినిమా ఆడిషన్ కోసం వచ్చిందనీ, అలాంటిది మీడియా వారిని వెంట వేసుకుని వచ్చి ఏదో ఘోరం జరిగిపోయిందని తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించాడు. కేసు కోర్టులో వున్నదనీ, ఏదైనా అక్కడే తేల్చుకుంటానంటూ వెల్లడించాడు.
కాగా తన భర్త పరాయి మహిళతో పడక గదిలో ఉండటాన్ని గుర్తించి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. తనకు విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే. గతంలో మిస్ వైజాగ్ టైటిల్‌ను గెలుచుకున్న నక్షత్ర 2017లో తేజ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో తేజ మరో మహిళతో వేరు కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపించింది. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తన భర్త ఆ మహిళతో కలిసి ఉండగా నక్షత్ర మీడియా ప్రతినిధులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తేజ, నక్షత్రల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. షూటింగ్ ఆఫీసు వద్దకు వచ్చి నక్షత్ర గొడవ చేయడంతో పోలీసులు ఆమెకు సర్ది చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు.