శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 మే 2024 (14:15 IST)

ఫోన్‌ను లాక్కున్న భర్త... కరెంట్ షాకిచ్చిన భార్య.. కుమారుడికి కూడా..

cell phone
తన భర్త మహిళ ఫోనును ఎత్తుకెళ్లాడనే కోపంతో భర్తకు కరెంట్ షాకిచ్చింది. ఫోనులో ఎక్కువ సమయం గడుపుతున్న భార్య ఫోనును లాక్కున్నాడనే కోపంతో.. 33 ఏళ్ల మహిళ భర్తకు మత్తుమందు ఇచ్చి మంచానికి కట్టేసింది. ఆమె అతడిని కొట్టి కరెంటు షాక్ ఇచ్చింది. వారి 14 ఏళ్ల కుమారుడు కూడా తన తండ్రిని కాపాడే క్రమంలో కరెంట్ షాకుకు గురయ్యాడు. 
 
ఈ ఘటనలో భర్త ప్రదీప్ సింగ్ సైఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. 2007లో ఔరయ్యకు చెందిన దివాన్ సింగ్ కుమార్తె బేబీ యాదవ్‌ను సింగ్ వివాహం చేసుకున్నాడు.  కానీ తన భార్య ఫోనులోనే గంటలు గంటలు గడిపేదని.. ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కరెంట్ షాక్ ఇచ్చిందని పోలీసులు బాధితుడు తెలియజేశాడు. ఇంకా క్రికెట్ బ్యాటుతో పదే పదే కొట్టిందని వాపోయాడు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.