గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 25 నవంబరు 2021 (10:03 IST)

ప్రతి గింజ కొనుగోలు చేస్తాం... నష్టపరిహారం ఖాతాల్లో జమ చేస్తాం...

అకాల వర్షాల కారణంగా నీట మునిగిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామ‌ని, ఈక్రాప్ బుకింగ్, ఈకేవైసీ చేయించుకున్న ప్రతిరైతుకు నష్టపరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య హామీ ఇచ్చారు. నియోజకవర్గం వ్యాప్తంగా పెద్దఎత్తున పంట పొలాలు నీట మునిగాయని, ఈనాటికి కొన్నిచోట్ల పొలాల్లో మోకాళ్ళ లోతు నీళ్ళు నిలబడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


నియోజకవర్గ రైతాంగ పరిస్థితులపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుతో మాట్లాడతాన‌ని, త్వరలో నష్టపరిహార నగదు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. రైతు ఎక్కడా నష్టం చవిచూడకుండా చూసే బాధ్యత తమదని, రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వం  తమ ప్రభుత్వమన్నారు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య.
 

తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్నపంట పొలాలను రైతులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పరిశీలించారు. పెదకాకాని మండల పరిధిలోని నంబూరు, వెంకటకృష్ణాపురం, అనమర్లపూడి, తంగెళ్ళమూడి, తక్కెళ్ళపాడు గ్రామాలలో పంట పొలాలను ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య సందర్శించారు.