Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఒకవైపు ప్రారంభోత్సవాలు, మరోవైపు ప్రతిపక్షంపై విమర్శలు: బిజీబిజీగా రోజా

Written By జె
Updated: శనివారం, 10 జులై 2021 (20:53 IST)
అనారోగ్యంతో కొన్నిరోజుల పాటు రెస్ట్ తీసుకున్న రోజా మళ్ళీ సొంత నియోజకవర్గంలో ప్రజల దగ్గరకు చేరువవుతున్నారు. అభివృద్థి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రతి నిరుపేద చెంతకు ప్రభుత్వ పథకాన్ని తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. బిజీబిజీగా రోజంతా గడుపుతున్నారు రోజా.
 
తన సొంత నియోజకవర్గమైన నగరిలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ బిజీబిజీగా ఉన్నారు రోజా. చిన్న గ్రామాల్లో సైతం ప్రభుత్వ నిధులతో వాటర్ ప్యూరిఫై నిర్మాణాలను చేపడుతూ, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి భూమి పూజలు చేస్తూ అభివృద్థి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో అందరికంటే ముందున్నారు.
 
ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ రోజా ప్రజల్లోకి వెళుతున్నారు. చెరగని చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షాలపైన తనదైన శైలిలో విమర్సలు గుప్పిస్తున్నారు.
 
ప్రభుత్వంమీద, సిఎంను టార్గెట్ చేస్తున్న టిడిపి నాయకులను వదిలిపెట్టడం లేదు రోజా. టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు నుంచి లోకేష్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులందరినీ వరుసగా ఏకిపారేస్తున్నారు. తనదైన స్వరంతో విమర్సలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. చిత్తూరుజిల్లాలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ప్రతిరోజు అభివృద్థి కార్యక్రమాల్లో రోజా చురుగ్గా పాల్గొంటూ ఉండటం స్థానిక వైసిపి నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

అన్నీ చూడండి

త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ పోస్టులు.. కాపీ క్యాట్ డైరక్టర్.. ఏకే, అజ్ఞాతవాసి, హనీ ట్రాప్ అంటూ..?

Ranabali trailer: రాయలసీమలో అణచివేతకు పోరాడే రాజవంశం కథగా రణబలి ట్రైలర్

Shruti Haasan: ఆ టాయ్స్‌ గురించి ఓపెన్‌గా మాట్లాడిన శృతిహాసన్

ఆకట్టుకునేలా గుడ్ టైమ్ ట్రైలర్ : అనిల్ విశ్వనాథ్, కామాక్షి భాస్కర్ల

Shweta Basuprasad: వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ వెబ్ సిరీస్ నా వైఫ్ మిస్సింగ్

తర్వాతి కథనం
Show comments