శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జులై 2021 (18:55 IST)

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జైలు శిక్ష

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జైలు శిక్ష ప‌డింది. ఆయ‌న‌కు ఆరు నెలల శిక్షతోపాటు, వెయ్యి రూపాయ‌ల‌ జరిమానా విధించింది ప్రజా ప్రతినిధుల కోర్టు. 2013లో బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో దానం నాగేందర్‌ను దోషిగా తేల్చింది న్యాయ‌స్థానం. 
 
ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచార‌ని రుజువైంది. అప్పీలుకు వెళ్ళేందుకు శిక్షను నెల రోజులు నిలిపి వేసింది కోర్టు. ఈ కేసులో దానం నాగేందర్‌ను దోషిగా తేల్చింది. అయితే  తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు నెల రోజుల పాటు కోర్టు అవకాశం ఇచ్చింది.