వావ్! సోలార్ ఎఫెక్ట్‌తో సూర్యుడు చిరంజీవి స్పందన
ప్రకృతి అందాలను ఆస్వాదించడంలో ప్రతివారికి మక్కువే. కానీ ఆ అవకాశం చాలా కొద్దిమందికే వస్తుంది. వాటి అందాలను మమేకంగా చూస్తూ మైమరిపోయేలా చేస్తుంది కొందరిని. మెగాస్టార్ చిరంజీవి కూడా అందులోని వారే. ఇంతకుముందు మొదటి వేవ్ కరోనా టైంలో జూబ్లీహిల్స్‌లోని తన ఇంటిలోని స్విమ్మింగ్ ఫూల్ నుంచి ఉయదంపూట పైకి వస్తున్నట్లుగా సూర్యోదయాన్ని కెమెరాతో షూట్ చేసి అందరికీ ట్వీట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తాజాగా ఈరోజు కూడా సూర్యుడిని అందాన్ని తన కెమెరా కళ్ళతో బంధించారు.
ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో షడెన్ గా ఉరుములు, మెరుపులతో వర్షం భారీగా పడింది. దానికి ముందుగా ఆకాశంలో ఓ చిత్రమైన దృశ్యం కనిపించింది. దాన్ని మెగాస్టార్ చిరంజీవి కెమెరాతో బంధించారు. ఆ టైంలో ఆయనకు ఏమీ పనిలేదా అనుకోకండి. కరోనా టైం కనుక ఆయన ఇంటివద్దనే వున్నారు. అయితే జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇల్లు చాలా ఎత్తైన ప్రదేశంలో వుంటుంది. అక్కడ నుంచి సిటీని చూడవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే జైంట్‌విల్ ఎక్కితే పైన వున్న వాడికి ఆకాశం ఎలా కనిపిస్తుందో ఆయన ఇంటిలో నుంచి చూస్తే అలా కనిపిస్తుంది. ఇంటి చుట్టూరా అద్దాలే. ప్రకృతి దృశ్యం అంత క్లియర్‌గా వారికి కనిపిస్తుంది. అందుకే ఆయన తన మాటలతో చిన్న ట్వీట్ చేశాడు.
వావ్! బ్యూటిఫుల్. ఈరోజు జూన్ 2, మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో మా ఇంటి పైన హాల్లో సోలార్ ఎఫెక్ట్‌తో సూర్యుడు దర్శనం ఇచ్చాడు. చాలా అందంగా వుంది. బ్యూటీఫుల్ సీన్ మీతో షేర్ చేసుకుందామని సరదాగా పోస్ట్ చేశాను. చూసి ఆనందించండి అంటూ వాయిస్ పెట్టారు.