బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను పట్టుకున్న కరోనా: 11 మందికి కోవిడ్

corona
ఐవీఆర్| Last Modified సోమవారం, 5 ఏప్రియల్ 2021 (18:37 IST)
కరోనావైరస్ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. గత నెలలో రోజుకి వందల్లో వున్న ఈ సంఖ్య ఇప్పుడు వేలకు చేరుకుంటుంది. తాజాగా తెలంగాణలోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఏకంగా 11 మంది పోలీసులకు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీనితో సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో సీఐ, ఎస్సైతో పాటు 9 మంది కానిస్టేబుళ్లు వున్నారు.

కాగా మొదటిదశ కరోనా సమయంలో 50 మంది పోలీసు అధికారులు-సిబ్బందికి కరోనా రాగా వారంతా కోలుకున్నారు. ఇప్పుడు 11 మందికి కరోనా సోకడంతో సిబ్బంది అలెర్ట్ అయ్యారు.దీనిపై మరింత చదవండి :