బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (11:55 IST)

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు - కరోనా వైరస్ పాజిటివ్

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యారు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయనను అరెస్టు చేసిన అధికారులకు కోవిడ్ భయం పట్టుకుంది. ఆ నటుడు పేరు అజాజ్ ఖాన్. ఆయన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు. 
 
అయితే అత‌నికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు అజాజ్ ఖాన్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అజాన్ ఖాన్‌ను విచారించిన బృందం క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోనుంది. 
 
మార్చి 30వ తేదీన రాజ‌స్థాన్ నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అజాజ్‌ను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సుమారు 8 గంట‌ల పాటు ప్ర‌శ్నించారు. అనంత‌రం ఆయ‌న‌ను అరెస్టు చేసిన‌ట్లు అధికారులు అధికారికంగా వెల్ల‌డించారు.
 
అయితే డ్ర‌గ్స్ పెడ్ల‌ర్ ఫ‌రూఖ్ బ‌టాటా, ఆయ‌న కుమారుడు షాదాబ్ బ‌టాటాను విచారించిన‌ప్పుడు ఖాన్ పేరు రావ‌డంతో అత‌న్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక బాలీవుడ్ న‌టుడికి సంబంధం ఉన్న అంధేరి, లోకండ్‌వాలా ఏరియాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. 
 
ఈ డ్ర‌గ్స్ కేసులో ఫ‌రూఖ్ బ‌టాటాను కూడా నిన్న 8 గంట‌ల పాటు ప్ర‌శ్నించారు. ఆయ‌న కుమారుడు షాదాబ్‌ను గ‌త వారం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా, అజాజ్ ఖాన్‌ను అరెస్టు చేయ‌డం ఇదే తొలిసారి కాదు. 2018లోనూ డ్ర‌గ్స్ కేసులోనూ అరెస్టు అయ్యారు.