శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2016 (12:34 IST)

ఆస్తి తగాదాలు : కుమారుడిని చంపి.. ముక్కలు చేసి గోనెసంచిలో దాచిన తల్లి

గుంటూరు జిల్లా బోడిపాళెంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల్లో ఓ తల్లి తన కన్నబిడ్డను పొడిచిచంపి.. ముక్కలు ముక్కలు చేసి గోనె సంచిలో దాచిపెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

గుంటూరు జిల్లా బోడిపాళెంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల్లో ఓ తల్లి తన కన్నబిడ్డను పొడిచిచంపి.. ముక్కలు ముక్కలు చేసి గోనె సంచిలో దాచిపెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ గ్రామానికి చెందిన అంజనాదేవికి ఆమె కుమారుడుకి అస్తి గొడవలు జరుగుతున్నాయి. దీంతో తల్లి కన్నబిడ్డను పొడిచి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా చేసి.. గోనె సంచిలోనే దాచి పెట్టింది. వారం రోజులుగా ఆమె కొడుకు కనిపించక పోవడంతో స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
పోలీసులు వచ్చి ఇంట్లో సోదాలు చేయగా, గోనె సంచిలో దాచివుంచిన మృతదేహం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య వారం రోజుల క్రితం జరుగగా, మృతదేహాన్ని వారం రోజుల పాటు గోనె సంచిలో దాచి పెట్టారు.