ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (21:38 IST)

దేవభూమి ఉత్తరాఖండ్‌లో చంద్రబాబు కోసం కేశినేని నాని యాగం

kesineni nani
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మద్దతు ప్రకటించారు. చంద్రబాబు క్షేమం కోసం విజయవాడ ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న ప్రఖ్యాతి గాంచిన రిషికేశ్ పట్టణంలోని దేవభూమి ఉత్తరాఖండ్ పుణ్యభూమిలో ఒక ముఖ్యమైన యజ్ఞ కార్యక్రమం జరిపించారు. వేద మంత్రోచ్ఛారణలు, పండితులు ఈ క్రతువును విజయవంతం చేశారు.
 
చంద్రబాబు త్వరలోనే న్యాయపరమైన కేసుల నుంచి విముక్తి పొంది ఆరోగ్యవంతంగా జీవించాలని కేశినేని నాని ఆకాంక్షించారు. చంద్రబాబు బాటలో అడ్డంకులు తొలగిపోవడానికి ఈ యాగం దోహదపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు.