ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2020 (17:53 IST)

మీ స్వార్థ రాజకీయాలకు ముస్లింలను వాడుకోవద్దు..

రాష్ట్రంలో ముస్లింలను రెచ్చగొట్టే విధంగా మరియు ఎక్కడా లేని విధంగా ముస్లింలకు ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంటే ప్రభుత్వానికి ముస్లింలను దూరం చేసే విధంగా భారీ కుట్ర జరుగుతుందని, అందుకు ప్రస్తుతం నంద్యాల సంఘటనను వాడుకున్న తీరు చాలా బాధాకరమని ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రజా విచారం వ్యక్తం చేశారు. కొండపల్లి హజ్రత్ సయ్యద్  షాఋఖారి ఆస్థాన నందు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అత్యంత బాధాకరం అని,ఆ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి  నేరుగా విచారణకు ఆదేశించి ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరిపించి నిందితుల మీద చర్యలు తీసుకున్నారని, కానీ చట్టంలోని ముసుగులను వాడుకున్న కొందరు వారికి బెయిల్ మంజూరు చేయించి ఈ సంఘటన ద్వారా రాష్ట్రంలో ముస్లింలను రెచ్చగొట్టే కార్యక్రమం చేపట్టారని, స్వార్థ  రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం బలిపశువులుగా వాడుకోవద్దు, ఇలాంటి వారు గత ప్రభుత్వంలో నంద్యాల మరియు గుంటూరు సంఘటనలో ఎందుకు మౌనం వహించారు అని సూటిగా ప్రశ్నించారు.
 
ముస్లింల యువకులను రెచ్చగొట్టి ప్రభుత్వానికి దూరం చేసే విధంగా చలో నంద్యాల అంటూ కార్యక్రమాలు చేస్తున్నారని ముస్లిం యువకులు సమన్యాయం పాటించి నిజానిజాలు తెలుసుకొని వ్యవహరించాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి ముస్లింలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఉప  ముఖ్యమంత్రి హోదా ఇచ్చి గౌరవించారని,నాడు రాజశేఖర్రెడ్డి ముస్లింలు ఎలా అండగా ఉన్నారు నేడు జగన్మోహన్రెడ్డి కూడా అలాగే అండగా ఉంటున్నారని అందుకు ఆయనకు కృతజ్ఞతలుగా ఉండాలి,కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు బలి అవ్వదని ఈ సందర్భంగా అల్తాఫ్ రజా  ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సలాం కుటుంబాన్ని కూడా పూర్తి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కి విజ్ఞప్తి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు